Girl Lost life in Vizianagaram.
విజయనగరం జిల్లా కేంద్రం శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈవినింగ్ వాక్‌కు వెళ్లిన 25ఏళ్ల యువతిపై గుర్తు తెలియని దుండగలు పెట్రోలు పోసి నిప్పంటించారు. పూర్తిగా కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికులు గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు.. బాధితురాలిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ఆ యువతి శనివారం ప్రాణాలు వదిలింది. బాధితురాలి బంధువుల, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలయ్యపేటకు చెందిన ఎం.అశ్విని(25) స్థానిక సీతం కళాశాలలో బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. అయితే శుక్రవారం సాయంత్రం ద్వారపూడి సమీపంలోని ఓ లేఅవుట్ ప్రాంతంలోకి వాకింగ్‌కి వెళ్లింది.
చీకటి పడే సమయంలో ఆమె ఇంటికి తిరిగి వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమె పేరు అడిగారు. ఆమె తనపేరు చెప్పగానే ఆమెను పట్టుకొని పెట్రోలు కలిపిన కిరోసిన్ ఆమెపై పోసి నిప్పు అంటించి పరారయ్యారు. జన సంచారం అంతగా లేని ప్రాంతం కావడంతో ఆమెను ఎవరు గమనించలేదు. దీంతో ఆమె 95శాతం కాలిపోయింది.