According to the latest update on this film regarding Samantha character, She is going to be seen as Dr. Rathi Devi Ph.D. Psychology. Touted to be a thriller, the film features her in a traditional avatar.
సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. కావాల్సినంత టాలెంట్ ఉన్నా.. ఒక్కోసారి ఒక్క అవకాశం చేతిలో ఉండకపోవచ్చు. అదే సమయంలో 'పెళ్లి' కూడా హీరోయిన్ల కెరీర్‌ను మలుపు తిప్పుతుంది. పెళ్లయిన హీరోయిన్లను హీరోల పక్కన చూపించడానికి ఇష్టపడని దర్శకులు, నిర్మాతలు ఉన్న ఇండస్ట్రీ మనది. ఇక కొంతమంది హీరోయిన్లయితే సహజంగానే పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రల కన్నా విభిన్న తరహా పాత్రలు చేయడానికే మొగ్గుచూపుతారు. ఇప్పుడదే దారిలో నడుస్తున్నారు అక్కినేని సమంత..
పెళ్లి అయిన కొద్ది రోజులకే షూటింగ్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు సమంత. అయితే పెళ్లి తర్వాత ఆమె ఎంచుకుంటున్న పాత్రలు విభిన్నంగా ఉన్నాయనే చెప్పాలి. విశాల్ 'ఇరంబు తిరై' చిత్రంలో సమంత పోషిస్తున్న పాత్రే ఇందుకు ఉదాహరణ. డాక్టర్ రతి దేవి అనే కీలక పాత్రలో సమంత ఇందులో నటిస్తున్నారు.
సైకాలజిలో పీహెచ్‌డి చేసిన యువతి పాత్రలో సమంత 'ఇరంబు తిరై'లో కనిపించనున్నారు. కథను మలుపు తిప్పే ఆసక్తికర స్క్రీన్ ప్లే ఈ పాత్రతో ముడిపడి ఉంటుందట.
ఇరంబు తిరై'లో సమంత పాత్రకు సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇందులో చీర కట్టులో సాంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు సమంత. అభిమానులను ఈ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంది.