Pawan Kalyan starrer Agnyaathavaasi which released January 10 for Sankranti. The film has reportedly been caught in a copyright row. There have been widespread speculations that Agnyaathavaasi may be a remake of the French film Largo Finch.
సినిమా పరిశ్రమలో సక్సెస్ మీదే బంధాలు, సంబంధాలు ఆధారపడి ఉంటాయనేది కొత్త విషయం కాదు. అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ మళ్లీ అందరికీ ఓ గుణపాఠం నేర్పుతున్నది. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రంపై అజ్ఞాతవాసి ప్రభావం భారీగానే పడే అవకాశం కనిపిస్తున్నది. ఈ ప్రాజెక్ట్‌లో మార్పులు చేర్పుల గురించి ఆసక్తికరమైన విషయాలు బాగానే వినిపిస్తున్నాయి. వాటిలో..
అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడానికి అనిరుధ్ రవిచందన్ మ్యూజిక్ ఓ కారణమనే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ చిత్రంలో అతను ఉండకపోవచ్చు అనే మాట ఫిలింనగర్‌లో బలంగా వినిపిస్తున్నది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మాస్. ఆయన చిత్రంలో డైలాగ్స్, పాటల్లో మాస్ ఎలిమెంట్స్ కనిపించకపోతే ప్రేక్షకులను మెప్పించలేము అనేది తెలిసిందే. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అనిరుధ్‌ను మార్చే ఆలోచనలో ఉన్నారనే వార్త మీడియాలో ప్రచారమవుతున్నది.
అజ్ఞాతవాసి చిత్రంలో అనిరుధ్ అందించిన పాటలు బాగానే ఉన్నప్పటికీ.. ఎక్కువగా క్లాస్ టచ్ కనిపించింది. వెస్ట్రన్ బీట్ ఎక్కువగా కనిపించింది. అలాంటి తరహా మ్యూజిక్ ఎన్టీఆర్ సినిమాకు సరిపడదు అని అంటున్నారు.
ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో భారీ మార్పులే కనిపించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లోకి దేవీ శ్రీ ప్రసాద్ ఎంటరయ్యే అవకాశం ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ లేకపోవడం వల్లే అజ్ఞాతవాసి చిత్రం తేడా కొట్టిందని ఫ్యాన్స్ మండిపడిన సంగతి తెలిసిందే.