Vijay Devarakonda, the latest heartthrob of Tollywood, is developing a bond with Kannada industry.
స్టార్ డమ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి కెమెరాకు పోజు ఇస్తే అభిమానులు పొందే కిక్కే వేరు. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్, అర్జున్ రెడ్డితో స్టార్ డమ్ దక్కించుకున్న విజయ్ దేవరకొండ.. అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరు కలిసి దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ వీళ్లిద్దరు ఎందుకు కలిసినట్లు?.. ఎక్కడ కలిసినట్టు?..
విజయ్ దేవరకొండ ఇటీవల బెంగళూరు వెళ్లిన సమయంలో.. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను ఆయన ఇంటి వద్ద కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి దిగిన ఫోటోను పునీత్ రాజ్‌కుమార్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
విజయ్ దేవరకొండతో దిగిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పునీత్ రాజ్ కుమార్.. 'సూపర్ టాలెంటెడ్ విజయ్ దేవరకొండను ఇంటిలో కలిశాను, ఈ వారం గొప్పగా ప్రారంభమైంది' అని పేర్కొనడం విశేషం.
ఫోటోలో విజయ్ దేవరకొండ, పునీత్ రాజ్‌కుమార్ ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లోనే కనిపిస్తుండటం విశేషం. ఈ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చిన ఫోటొ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ ఫోటో పట్ల విజయ్ దేవరకొండ హ్యాపీగా ఫీలవుతున్నాడు. పునీత్ అన్నతో సరదాగా గడిపానంటూ విజయ్ ట్వీట్ ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. ఇందులో కన్నడ నటి రష్మికా మండన్న కథానాయిక.