Priya Prakash Warrier is the new CRUSH on the internet. Ever since her song Manikya Malaraya Poovi from the Malayalam film Oru Adaar Love released, Priya has become the most searched person on Google. Priya has even taken down Sunny Leone.
ప్రియా వారియర్....మెన్నటి వరకు ఈ అమ్మాయి గురించి ఎక్కువ మందికి తెలియదు. కానీ ఒకేఒక్క వీడియోతో ఈ బ్యూటీని పెద్ద సెలబ్రిటీని చేసేసింది. దేశ వ్యాప్తంగా ఈమె గురించి చర్చించుకునేలా చేసింది. కేవలం తన కళ్లతోనే అద్భుతమైన భావాలు పలికించి యవతను తన మాయలో పడేలా చేసుకుంది. ఇంటర్నెట్లో సంచలనంగా మారిన ప్రియా వారియర్ తాజాగా సన్నీ లియోన్‌ను సైతం వెనక్కి నెట్టేసింది.
గూగుల్‌లో ఇప్పటి వరకు మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీల లిస్టులో సన్నీ లియోన్ అగ్రస్థానంలో ఉండేది. అయితే ఇపుడు సన్నీని వెనక్కి నెట్టేసి ప్రియా వారియర్ మొదటి స్థానంలో నిలిచింది.
ఓరు అడార్ లవ్' సినిమాలోని ఓ సీన్ సినిమా ప్రమోషన్ కోసం విడుదలవ్వగా.... అందులో ఆమె కన్నుకొడుతున్న షాట్ సంచలనం అయింది. కళ్లతో ఆమె పలికించే హావభావాల్లో ఒక మత్తు ఉండటంతో అంతా ఫ్లాట్ అయిపోయారు. సోషల్ మీడియాలో ఆమెకు ఇపుడు కోట్లాది మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు.
ఆ వీడియో పుణ్యమా అని ప్రియా వారియర్‌పై అన్ని సినిమా ఇండస్ట్రీల కన్ను పడింది. పలువురు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
నిఖిల్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం ప్రియా ప్రకాశ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమెకు డిమాండ్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిఖిల్-తరుణ్ భాస్కర్ మూవీ కోసం ప్రియా వారియర్ డేట్స్ చూస్తున్న దర్శకుడు ఒమర్ లులును సంప్రదించగా రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు.