Surprise Me!

Why Babu Saying No For No Confidence Motion ?

2018-02-19 284 Dailymotion

YSR Congress Party leader Botsa Satyanarayana on Monday questioned AP CM Nara Chandrababu Naidu why he is saying no for No Confidence Motion against Modi's government.

కేంద్రంపై అవిశ్వాసం అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారని, ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అవిశ్వాసం అవసరం లేదని చంద్రబాబు అనడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారని బొత్స ఆరోపించారు. రెండేళ్ల క్రితం కూడా ఏపీకి ప్రత్యేక హోదాపై జాతీయ పార్టీలు కలిసి వస్తే తాము మద్దతుగా ఉంటామని చెప్పినప్పుడు టీడీపీ హోళన చేసిందన్నారు. ఇప్పుడు హోదా గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
ప్రత్యేక హోదాపై తాము చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ కలిసి వస్తే మంచిదని బొత్స సూచించారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకు తాము అవిశ్వాసానికి సిద్ధమని చెప్పామని, అలా అంటే తమకు చట్టాలు తెలియవా అని చంద్రబాబుపై మండిపడ్డారు. టీడీపీ, జనసేన మధ్య మిత్రుత్వం ఉందో లేదో పవన్ చెప్పాలని నిలదీశారు.
ప్రత్యేక హోదా కోసం హోదా కోసం ఏ పార్టీకి మద్దతిచ్చేందుకైనా తాము సిద్ధమని బొత్స చెప్పారు.
తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, అది సరికాదని బొత్స విమర్శించారు. బీజేపీతో టీడీపీ నాలుగేళ్లు కాపురం చేసి ఇప్పుడు తమను కుమ్మక్కు అనడం విడ్డూరమన్నారు.
పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీని పవన్ ఒప్పించాలని మరో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. మోడీకి భయపడి చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు.