Surprise Me!

Helicopter taxi service : Finally, a solution to Bengaluru's traffic

2018-03-05 2 Dailymotion

Bengaluru's Helicopter taxi service take off on Monday with users able to fly from Kempegowda International Airport to Electronic city in 15 minutes

బెంగళూరు నగర శివార్లలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోసూరు రోడ్డులోని ఎలక్ట్రానిక్ సిటీకి హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం అయ్యాయి. మార్చి 5వ తేదీ సోమవారం ఎలక్ట్రానిక్ సిటీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మొదటి హెలికాప్టర్ ట్యాక్సీలు విహరించింది. తరువాత మరో హెలికాప్టర్ రెండు ప్రాంతాలకు సంచరించింది. ప్రస్తుతం రెండు హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చారు.

కేరళలోని కొచ్చికి చెందిన తుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బెంగళూరులో హెలికాప్టర్ ట్యాక్సీ సేవలకు శ్రీకారం చుట్టింది. హెలికాప్టర్ ట్యాక్సీ సర్వీసులకు ఇప్పటికే మంచి డిమాండ్ ఏర్పడిందని, త్వరలో మరన్ని ప్రాంతాల నుంచి హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని తుంబి ఏవియేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాప్టెన్ కేఎన్ జీ. నాయర్ తనను కలిసిన మీడియాకు చెప్పారు.

బెల్ 407 హెలికాప్టర్ టాక్సీ సేవలు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం- ఎలక్ట్రానిక్ సిటీ- హెచ్ఏఎల్ మార్గాల్లో సంచరిస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి ఉదయం 9.30 గంటల వరకు, మద్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు బెల్ 407 కంపెనీకి చెందిన రెండు హెలికాప్టర్ ట్యాక్సీలు సంచరిస్తున్నాయి

బెంగళూరులో హెలికాప్టర్ ట్యాక్సీలో సంచరించే ప్రతి ప్రతిప్రయాణికుడు టిక్కెట్ ధర రూ. 4,100 (రూ. 3,500+జీఎస్ టీ) చెల్లించాలి. ప్రయాణికులతో పాటు 15 కేజీల లగేజీని హెలికాప్టర్ ట్యాక్సీలో తరలించడానికి అవకాశం కల్పించారు.