Harbhajan Singh shared a Bichuu Dance video on his Twitter account. The Nidhas Trophy between India, Sri Lanka and Bangladesh has been in the spotlight for more than good cricket and for other reasons. Bangladesh 'Nagin Dance'attracted attention.
స్టేడియంలో వీక్షకులు, క్రికెట్ అభిమానులు చివరికి కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న సునీల్ గవాస్కర్ సైతం నాగిని డ్యాన్స్ అనుకరించారు. నిదహాస్ ట్రోఫీలో పాల్గొన్న బంగ్లాదేశ్ జట్టు అందరికీ ఈ నాగిని డ్యాన్స్ ఫేమస్ చేసింది. దీంతో నిదహాస్ ట్రోఫీ పుణ్యమా అని నాగిని డ్యాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనికి పోటీగా హర్భజన్ సింగ్ బిచ్చూ డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియోను తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
దీనికి పోటీగా బిచ్చూ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
నాగిని డ్యాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో చూశాం. ఇప్పుడు మీ కోసం బిచ్చూ డ్యాన్స్‌ను పరిచయం చేస్తున్నాను. ఈ వారాంతం బాగా ఎంజాయ్ చేయండి' అని భజ్జీ పేర్కొన్నాడు. ఈ వీడియోలో ఒక వ్యక్తి డప్పు శబ్దాలకనుగుణంగా డ్యాన్స్ చేస్తాడు. ఆ స్టెప్పులు చాలా విచిత్రంగా ఉన్నాయి.