Rajamouli is busily finalising the cast of the film though no one knows what is the story of his next film, which is being trended with the hashtag #RRR.Reports are coming that for both Jr NTR and Ram Charan, the leading director found a terrific villain.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా మల్టీ స్టారర్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. డివివి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు రోజుల క్రితమే అఫీషియల్‌గా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
రాజమౌళి తన సినిమాల్లో హీరోను ఎంత హైలెట్ చేస్తారో... విలన్ పాత్రలను కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా చూపిస్తారు. ఆయన గత చిత్రాలు ఈగలో విలన్‌గా కన్నడ హీరో సుదీప్‌ను చూపించగా, బాహుబలిలో రానాను విలన్ పాత్రలో చూపించారు. #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి విలన్ విషయంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సమాచారం
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజశేఖర్ విలన్ పాత్రలో నటించబోతున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయ్యాయి. రాజశేఖర్ కూడా గతంలో పలు సందర్భాల్లో తనకు నచ్చే విధంగా ఉంటే విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమే అని ప్రకటించిన సంగతి తెలిసిందే. #ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో రాజశేఖర్ విలన్ అయితే సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా... డివివి ఎంటర్టెన్మెంట్స్ ‘ఆర్ఆర్ఆర్' పేరుతో ఓ టీజర్ విడుదల చేశారు. అయితే ఇది టైటిల్ కాదని.... రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్), రామ్ చరణ్ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ముగ్గురి పేర్లు వచ్చేలా ఇలా అనౌన్స్ చేశారట. అఫీషియల్ టైటిల్ ఫైనల్ అయ్యే వరకు ఉపయోగించే తాత్కాలిక పిలుపు మాత్రమే అని చిత్ర యూనిట్ తెలిపారు.