Surprise Me!

తోటపిల్లి కుటుంబం లో ఇంకా దొరకని ఒకరి ఆచూకి

2018-04-17 1,026 Dailymotion

గత కొద్ది రోజుల క్రితం అమెరికాలో అదృశ్యమైన భారతీయ కుటుంబం కథ విషాదాంతమైంది.అమెరికాలో స్థిరపడిన తోటపల్లి సందీప్ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు ఓ నదిలో లభ్యమయ్యాయి.
కాలిఫోర్నియాలోని శాంటాక్లారిటలో నివాసం ఉండే సందీప్ తోటపల్లి, ఆయన భార్య సౌమ్య, వారి పిల్లలు సిద్ధాంత్, సాచీలు గత కొద్ది రోజుల క్రితం తమ ఎస్‌యూవీలో విహార యాత్రకు వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. అదృశ్యమైన ఈ కుటుంబం కోసం పోలీసులు, సహాయక బృందాలు విస్తృతంగా గాలించారు.
చివరకు కాలిఫోర్నియాలోని ఈల్ నదిలో పడిపోయిన ఎస్‌యూవీలో రెండు మృతదేహాలను కనుగొన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆ మృతదేహాలను 41ఏళ్ల సందీప్ తోటపల్లి, 9ఏళ్ల సాచి తోటపల్లివిగా గుర్తించినట్లు చెప్పారు. గత శుక్రవారం ఇదే నదిలో 38ఏళ్ల సౌమ్య తోటపల్లి మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు. సందీప్, సౌమ్య దంపతులు 12ఏళ్ల కుమారుడు సిద్ధాంత్ తోటపల్లి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదని చెప్పారు. అతడి మృతదేహం కోసం నదిలో 20మంది సభ్యుల బృందం గాలిస్తోందని తెలిపారు. కాగా, సందీప్ కుటుంబం ఏప్రిల్8 నుంచి అదృశ్యమైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ శాంటాక్లారిటా వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు సందీప్ తోటపల్లి. ఆ ప్రాంతంలో ఆయనకు మంచి పేరుంది. ఈయన తన కుటుంబంతో గత కొద్దిరోజుల క్రితం పోర్ట్‌ల్యాండ్ నుంచి శాన్‌జోస్‌కు ప్రయాణిస్తున్నారని, అయితే, మధ్యలోనే ఈ ఫ్యామిలీ అదృశ్యమైందని పోలీసులు తెలిపారు. కాగా, సందీప్‌ తల్లిదండ్రులు గుజరాత్‌లో ఉన్నారు. గుజరాత్‌లోనే పెరిగిన సందీప్‌ పదిహేనేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారి మరణవార్త గుజరాత్‌లోని సందీప్‌ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, సౌమ్య స్వస్థలం కేరళలోని కొచ్చి.