Surprise Me!

Salman Gives A Strong Reply For Media

2018-05-16 1 Dailymotion

Salman On Blackbuck Verdict: 'Did You Think I Was Going To Go In Forever. Salman Khan talks about Blackbuck Verdict at Race 3 trailer launch event
#SalmanKhan

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తడి చిత్రాలు యావరేజ్ గా ఆడినా బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల బిజినెస్ చేస్తాయి. ఇటీవల కృష్ణ జింకల కేసులో తుది తీర్పు రావడం, రెండు రోజులు జైలులో గడిపిన అనంతరం సల్మాన్ ఖాన్ కు బెయిల్ రావడం జరిగిన సంగతి తెలిసిందే. జోధ్ పూర్ న్యాయస్థానం తీర్పు ప్రకటించిన సందర్భంలో సల్మాన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతల్లో వెన్నులో వణుకు పుట్టింది. దాదాపు 1000 కోట్ల బిజినెస్ తో సల్మాన్ నటిస్తున్న చిత్రాలు ఉన్నాయి. సల్మాన్ కు బెయిల్ రావడంతో నిర్మాతలంతా ఊపిరి పీల్చుకున్నారు.రేస్ 3 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కృష్ణ జింకల కేసు గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడాడు.
రేస్ 3 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ విలేఖరి కృష్ణ జింకల కేసుకు సంభంధించిన ప్రశ్న సంధించాడు. దీనికి సల్మాన్ ఖాన్ ఇచ్చిన సమాధానం ఆసక్తిగా ఉంది. జీవితాంతం నేను జైల్లోనే ఉంటానని భావిస్తున్నారా అంటూ సల్మాన్ తిరిగి విలేఖరిని ప్రశ్నించాడు. అందుకు లేదు అని విలేకరి బదులు ఇచ్చాడు.
కృష్ణ జింకల కేసు విషయంలో తనకు భాద లేదని, దాని గురించి ఆలోచించడం లేదని సల్మాన్ ఖాన్ తెలిపాడు.1998 లో ప్రారంభం అయిన ఈ కృష్ణ జింకల కేసు ఇప్పటికి సల్లూభాయ్ ని వెంటాడుతూనే ఉంది.
ఈ కేసులో తనకు వేసిన శిక్షని కొట్టివేయాలని సల్మాన్ ఖాన్ కోర్టులో అభ్యర్థన పెట్టుకున్నారు. దీనిపై విచారణ జులై లో జరగనుంది. కథువా ఘటన గురించి స్పందించిన సల్మాన్ దేశంలో అలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అన్నారు.
ఈ కేసుల విషయాన్ని పక్కన పెడితే సల్లూభాయ్ నటించిన రేస్ 3 చిత్రం జూన్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజగా విడువులైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. రెమో డిసౌజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.