Surprise Me!

Naa Peru Surya Co-Producer Naga Babu Gets His Share

2018-05-31 937 Dailymotion

Naga Babu gets 5 crore for Naa Peru Surya. Naga Babu is one of the coproducers of Naa Peru Surya

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయంగా ఖరారైంది. దేశభక్తి కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ కు ఎక్కలేదు. కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉన్నపటికీ అల్లు అర్జున్ నుంచి ఆడియన్ కోరుకునే వినోదం లేకపోవడంతో నా పేరు సూర్య బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీ వాసు, మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచినప్పటికీ నాగబాబు తన షేర్ తాను పొందారని వార్తలు వస్తున్నాయి.
మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా గతంలోనే విఫలం అయ్యారు. ఆరెంజ్ చిత్రంతో భారీ నష్టాలని చవిచూశాడు. ఆ తరువాత నాగబాబు చిత్రాన్ని నిర్మాణాన్ని పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే.
నిర్మాతగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని నాగబాబు నా పేరు సూర్య చిత్రానికి కేవలం సహ నిర్మాతగా మాత్రమే వ్యవహరించారు. నాగబాబుని సహనిర్మాతగా ఉండమని అల్లు అరవింద్ కోరిన సంగతి తెలిసిందే.
నా పేరు సూర్య చిత్రం నిరాశపరిచి బయ్యర్లకు భారీ నష్టాలనే మిగిల్చినట్లు తెలుస్తోంది. అన్ని ఏరియాలలో 50 నుంచి 40 శాతం వరకు నష్టాలే మిగిలాయట.నా పేరు సూర్య చిత్రం బయ్యర్లకు భారీ దెబ్బ అని చెప్పొచ్చు. కానీ మంచి ప్రీరిలీజ్ బిజినెస్ కారణంగా నిర్మాతకు మంచి లాభాలే మిగిలినట్లు తెలుస్తోంది.