Surprise Me!

Character Artist Sudha Talks About Uday Kiran

2018-06-05 2,748 Dailymotion

Character Artist Sudha, who had a close bond with late Telugu actor Uday Kiran. She has made some fascinating facts about his passing in her recent interview.
#CharacterArtistSudha
#UdayKiran

ప్రముఖ తెలుగు నటి సుధ ఇటీవల ఓ టీవీ షోలో సందడి చేశారు. కమెడియన్ ఆలీ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1981లో ఇండస్ట్రీకి వచ్చానని, తాను హీరోయిన్ గా నటించిన తొలి 2 సినిమాలు విడుదల కాలేదు. అవి విడుదల కాకపోవడం వల్లనే ఈ రోజు ఇండస్ట్రీలో మీ ముందు ఉన్నాను. అదే విధంగా తనను అనకూడని మాటలు అన్న ఓ దర్శకుడి గురించి కూడా సుధ వెల్లడించారు. యంగ్ హీరో ఉదయ్ కిరణ్‌ గురించి, అతడితో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకుని ఈ సందర్భంగా సుధ ఎమోషనల్ అయ్యారు.
హీరో ఉదయ్ కిరణ్‌ను మీరు దత్తత తీసుకోవాలనుకున్నారట కదా? దాని గురించి చెప్పండి.... ఈ కార్యక్రమానికి వచ్చే ముందే బాలచందర్ గారి గురించి అడిగినా, ఉదయ్ కిరణ్ గురించి అడిగినా ఎమోషనల్ అవ్వకూడదని అనకుని వచ్చాను. కానీ నా వల్ల కావడం లేదు. ఆ అబ్బాయి గురించి అడిగితే కంట్రోల్ అవ్వలేను, అదే విధంగా మా మదర్ గురించి అడిగినా కంట్రోల్ చేసుకోలేను.... అని సుధ తెలిపారు.
ఉదయ్ కిరణ్ 9 సినిమాల్లో నా కొడుకుగా చేసే సరికి నిజంగానే మా మాధ్య తల్లి కొడుకుల ఫీలింగ్ పెరిగిపోయింది. వాడి ప్రవర్తన కూడా అలాగే ఉండేది. అమ్మా అమ్మా అని ఆప్యాయంగా పిలిచేవాడు. వాడు ఇలాంటి చెడు ఆలోచన(ఆత్మహత్య)కు వెళతాడని అనుకోలేదు. ఒక వేళ నేను దత్తత తీసుకుని ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో. దాన్ని ఇంకా మరిచిపోలేదు.... అని సుధ వెల్లడించారు.
ఉదయ్ వాళ్ల తల్లి చనిపోయిన తర్వాత ఓసారి నన్ను కలిసేందుకు వచ్చాడు. అపుడు నేను ఏదో షూటింగులో ఉన్నాను. అమ్మను కలవాలి అని మా స్టాఫ్‌ను అడిగాడట. నా దగ్గర వాడికి మొహమాటం ఎందుకు రమ్మని చెప్పాను. వచ్చి చేతులు కట్టుకుని కింద కూర్చుని ఏడుస్తూ ఉండిపోయాడు. వాడంటే నాకు ప్రాణం. అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను. నేనూ ఏడ్చేశాను. ఏంట్రా... ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడిగాను. మిమ్మల్ని చూస్తుంటే అమ్మ అని పిలవాలని ఉందని, మీతో అన్నీ చెప్పాలని అనిపిస్తుంది అన్నాడు. సరే చెప్పుకో అన్నాను.... ఏడుస్తూ ఉండిపోయాడే తప్ప ఏమీ చెప్పలేదు అని సుధ గుర్తు చేసుకున్నాడు.