Surprise Me!

IPL 2018 : Nitish Rana Gets Engaged With Saachi Marwah

2018-06-12 166 Dailymotion

The promising left-handed batsman was the part of the Kolkata Knight Riders (KKR) in the recently concluded Indian Premier League (IPL).

భారత క్రికెటర్లకు పెళ్లి కళ వచ్చేసింది. ఒక్కొక్కరుగా వివాహానికి సిద్ధమైపోతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం మొదలుకొని వరుస వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. గత వారం మయాంక్‌ అగర్వాల్‌ ఓ ఇంటివాడు కాగా రెండు రోజుల క్రితం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సందీప్‌ శర్మ కూడా తన స్నేహితురాలిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.
తాజాగా మరో ఆటగాడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. అతడు మరెవరో కాదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన నితిశ్‌ రాణా. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో నితిశ్ రాణాకు తన స్నేహితురాలు సాచిన మార్వాకు నిశ్చితార్థం జరిగింది. ముఖ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ వేడుకను నిర్వహించారు. రాణా సహచర ఆటగాడు దృవ్‌ శర్మ ఈ వేడుకకు హాజరయ్యాడు.
రాణా-సాచి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోను దృవ్‌ సోషల్‌మీడియా ద్వారా పంచుకుని శుభాకాంక్షలు తెలిపాడు. రాణా-సాచిల పెళ్లి తేదీ ఇంకా ఖరారు చేయలేదు. వీరిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడిన రాణా మొత్తం 15 మ్యాచ్‌ల్లో 304 పరుగులు చేశాడు. అంతేకాదు 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.