Surprise Me!

Celebrities Prays For Sonali Recovery

2018-07-05 1,214 Dailymotion

సోనాలి బింద్రే తెలుగులో నటించింది 6 చిత్రాల్లో మాత్రమే. కానీ అందులోనే చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు ఉన్నాయి. మురారి, ఇంద్ర, మన్మధుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో సోనాలి నటించింది. ఈ అందాల తార కేన్సర్ బారిన పడడం బాధాకరం. తనకు హై గ్రేడ్ క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ అయిందని సోనాలి బింద్రే ఇటీవల తెలిపింది. సోనాలి త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు. ఆమె కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆమె క్యాన్సర్ ని జయించేలా ధైర్యాన్ని ఇస్తున్నారు. సోనాలి కోలుకోవాలని ప్రముఖుల మెసేజ్ లు ఇప్పుడు చూద్దాం.
క్యాన్సర్ నుంచి నీవు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. క్యాన్సర్ ని జయించే ఆత్మ స్థైర్యం నీకు కలగాలి అని నాగార్జున ట్విట్టర్ లో స్పదించారు. నాగార్జున, సోనాలి బింద్రే కలసి మన్మధుడు చిత్రంలో నటించారు.
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ సోనాలి కోసం ట్వీట్ చేశాడు. ఈ వార్త వినగానే చాలా బాధ కలిగింది. త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ రితేష్ పేర్కొన్నాడు.
నీవు ఎంతటి బలమైన మహిళవో నాకు తెలుసు. నటిగా, రచయితగా, తల్లిగా రాణించావు. ఈ పోరాటంలో తప్పకుండా క్యాన్సర్ ఓడిపోతుంది. మా ప్రేమ ఎప్పుడూ నీకు ఉంటుంది అని వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నాడు.

Celebrity prayers for Sonali Speed recovery. Nagarjuna good wishes to his co star