Surprise Me!

చైనా లో బైక్ టాక్సీ వ్యక్తి పై దారుణం

2018-07-25 440 Dailymotion

చాలా మంది వారిపై సడన్ గా ఎవరైనా అటాక్ చేస్తే అక్కడికక్కడే కూలిపోతారు. తర్వాత ఎవరి సాయం అందకపోతే చనిపోతారు. కానీ కొందరు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. కొన ఊపిరితో ఉన్నా మళ్లీ బతుకుతారు. అయితే అలా అందరికీ సాధ్యం కాదు. కొందరు మాత్రమే అలా బతికి బట్టగలుగుతారు.
చైనాలో ఇటీవల ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అతని పేరు క్యూన్. అతనిది గువాంగ్జో. క్యూన్ వయస్సు 32 ఏళ్లు. అతను ఒక బైక్ ట్యాక్సీ డ్రైవర్. ఒక ప్యాసింజర్ ని బైక్ పై ఎక్కించుకుని వెళ్తుంటే సడన్ గా అతను క్యూన్ పై అటాక్ చేశాడు. బైక్ స్లోకాగానే ప్యాసింజర్ పారిపోయాడు. తర్వాత క్యూన్ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దాదాపు ఇరవై నిమిషాల పాటు బైక్ నడుపుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. పోలీసుల సాయంతో క్యూన్ హాస్పిటల్ కు వెళ్లాడు.