A powerful 6.9 magnitude earthquake struck Indonesia Sunday evening local time. At least 82 people have been , the Associated Press reported.
ఇండోనేషియా లంబోక్ దీవుల్లో భారీ భూకంపం (స్థానిక ఇండోనేషియా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం) సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 6.9గా నమోదయింది. భూకంపం కారణంగా 82 మంది వరకు మృతి చెందారు. వేలాదిమంది గాయపడ్డారు. భూకంపం తర్వాత కూడా కొన్ని ప్రకంపనలు వచ్చాయి. భూకంపం దాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయంతో ఇళ్లను వదిలి బయటకు పరుగులు పెట్టారు. భూకంప కేంద్రం భూమిపై నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు జియలాజికల్ సర్వే వెల్లడించింది.
#indonesia
#earthquake
#bali
#Sumatra
#People
#Magnitude
#Tsunami