Surprise Me!

Kamal Hasan Indian 2 : Major Fight Between Director Shankar And Lyca Productions.

2019-02-19 148 Dailymotion

Reports suggest that director Shankar and Lyca Productions had a major fallout regarding the budget of their forthcoming flick Indian 2, starring Kamal Haasan.
#kajalaggarwal
#shankar
#indian2
#bharateeyudu
#kamalhaasan
#lycaproductions
#2.O
#rajinikanth
#anirudhravichander

స్టార్ డైరెక్టర్ శంకర్ సూపర్ స్టార్ రజని 2.0 తర్వాత మరో బిగ్ ప్రాజెక్ట్ ని టేకప్ చేశాడు. లోకనాయకుడు కమల్ హాసన్ తో ఇండియన్2 సీక్వెల్ కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2.0 చిత్రానికి నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మించేందుకు సిద్ధం అయింది. చిత్రం ప్రారంభమయ్యాక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తమిళ సినీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనితో భారతీయుడు 2 చిత్రం ఆగిపోయిందంటూ కూడా ప్రచారం జరుగుతోంది.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు మూవీ 1996లో విడుదలయింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు శంకర్ ప్లాన్ చేశారు. భారతీయుడు చిత్రంలో వృద్దుడిగా కమల్ నటన అద్భుతం. ఆలోచింపజేసే సందేశాత్మక అంశాలతో కళాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.గత ఏడాది 2.0 చిత్రం విడుదల కాగానే శంకర్ భారతీయుడు 2 చిత్ర పనులు ప్రారంభించాడు. ఇటీవలే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. భారతీయుడులో కనిపించిన ఓల్డ్ మాన్ లుక్ లోనే కమల్ ఈ చిత్రంలో కూడా కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈచిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. నిర్మాతలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో భారతీయుడు 2 చిత్రం ఆగిపోయే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.