Urvashi Rautela,who is rumoured to have dated Hardik Pandya in the past, has wished Natasa Stankovic and the cricketer on their engagement.
#HardikPandya
#NatasaStankovic
#HardikPandyaengagement
#UrvashiRautela
#ViratKohli
#rohitsharma
#klrahul
#yuzvendrachahal
#cricket
#teamindia
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. సెర్బియా నటి, మోడల్ నటాషా స్టాన్‌కోవిచ్‌ను త్వరలో వివాహమాడనున్నాడు. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం పాండ్యా-నటాషాలు ఓ హ్యాచ్‌లో ప్రయాణిస్తూ రింగ్స్ మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బుధవారం హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం విషయం తెలిసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర క్రికెటర్లు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఇక పాండ్యా మాజీ ప్రియురాలు, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. 'నటాషా-పాండ్యా జంటకు ప్రత్యేక శుభాకాంక్షలు. మీ బంధం ఎప్పుడూ ప్రేమతో, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా' అని పాండ్యా పోస్టుకు కామెంటు పెట్టింది.
మరోవైపు నటాషా పోస్టుపై ఆమె మాజీ ప్రియుడు, టీవీ నటుడు అలై గోని స్పందించాడు. హార్ట్ సింబల్‌తో కూడిన ఎమోజీ పోస్ట్ చేశాడు. ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా కేవలం హార్ట్ సింబల్‌ను మాత్రమే గోని పోస్ట్ చేయడం విశేషం. గతంలో నటాషా, గోనిలు ప్రేమలో ఉన్నారు. నాచ్‌బేలియెలో వీరిద్దరికి పరిచయం. ఏమైందో తెలియదుకానీ నటాషా, గోనిలు విడిపోయారు.
గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్ పాండ్యా ఆటకు దూరమయ్యాడు.