ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, పింఛన్ రూ. 4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అదే విధంగా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్య అంశాల గురించి మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.