Deputy CM Bhatti Fires BRS Past Ruling : గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసింది అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. భద్రాద్రిలో మంచినీటి పథకానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌తో కలిసి భట్టి పాల్గొన్నారు. మొదటగా కొత్తగూడెం పట్టణానికి అమృత పథకం కింద రూ.234 కోట్లతో మంచినీటి పథకానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.