Minister Tummala Sudden Inspection in Agriculture Commissionerate : ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అసలు డ్యూటీకి హాజరవుతున్నారా? వారి పనితీరు ఎలా ఉంది అనే దానిపై వరుస తనిఖీలు చేస్తూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు టైమ్‌కి రాకపోయినా, పని తీరు సరిగ్గా లేకపోయినా నివేదికలు అడుగుతున్నారు. కొన్నిసార్లు అక్కడికక్కడే అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు.