Golkonda Bonalu 2024 : అమ్మాబైలెల్లినాదో అంటూ గోల్కొండ బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డబ్బు చప్పుళ్లు ఢోలు విన్యాసాలు పోతురాజున వీరంగాల నడుమ ఆడపడుచులు అమ్మకు బోనమెత్తారు. శివసత్తుల విన్యాసాలు కనువిందు చేయంగా పసుపు బోనాలు వేపకొమ్మల పసరు వాసనలతో గోల్కొండ కోట సరికొత్త శోభను సంతరించుకుంది. ఏడుగురక్కచెలెళ్లల్లో పెద్దదైన గోల్కొండ జగదాంబిక అమ్మకు తొలిబోనం అందింది.