Farmer loan waiver in Telangana : రుణమాఫీపై సర్కారు రైతులకు చేసే సాయం కంటే, వడపోతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రేషన్‌కార్డులు ఉన్నవారికే రుణమాఫీ చేయడం సరికాదని, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలతో రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.