IT Employee Yalla Krishnaveni Success Story : ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, లక్ష్యం ఎంచుకుని కఠోర సాధన చేసింది ఈ అమ్మాయి. ఇంజినీరింగ్ పూర్తి చేయకముందే ఉద్యోగం సాధించాలని, ప్రణాళిక వేసుకుంది. ఏఐ, కోడింగ్, డేటా సైన్స్ అంశాలపై ఆసక్తితో ఇంటర్న్‌షిప్ చేసింది. ఎంచుకున్న కోర్సులోనూ సత్తాచాటింది. ఫలితంగా ఆశించినట్లే ఓ బహుళజాతి కంపెనీలో భారీ ప్యాకేజీని సొంతం చేసుకుంది.