CM Chandrababu Direction to Ministers: ప్రజలకు చేసిన మంచి చెప్పుకోలేక గతంలో ఇబ్బందులు పడ్డామని, ఈసారైనా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు అమాత్యులకు దిశానిర్దేశం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డీఎస్సీ వంటివి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అదే సమయంలో ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారాల్ని అంతే గట్టిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు.