Ashritha From Karimnagar Bag 52 lakhs Package : బీటెక్ పూర్తి చేయాలి. మంచి ఐటీ కంపెనీలో కొలువు సంపాదించాలి. అలా అయితేనే లక్షల్లో ప్యాకేజీ దక్కుతుందని చాలామంది నమ్మకం. ప్రతిభ ఉంటే సాఫ్ట్‌వేర్ రంగంలోనే కాదు. హార్డ్‌వేర్ రంగంలోనూ లక్షల్లో వేతనం అందుకోవచ్చని నిరూపించిందీ రైతుబిడ్డ. తల్లిదండ్రులకు చదువుపట్ల అవగాహన లేకున్నా స్వీయ ప్రయత్నాలతో లక్ష్యం చేరుకుని ఆశ్చర్యపరుస్తోంది. పట్టుదలతో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఏడాదికి ఏకంగా 52 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం సాధించి ఔరా అనిపిస్తున్న ఆశ్రిత సక్సెస్ స్టోరీ ఏంటో మీరూ చూసేయండి.