BRS Protest Against on Telangana Job Calendar : జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళన చేసిన కేటీఆర్, 2 పేపర్లపై ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని ఆక్షేపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని కోరితే, తమకు 2 నిమిషాలు కూడా మైక్ ఇవ్వలేదన్నారు. తెలంగాణ శాసనసభ దుశ్శాసనసభగా మారిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.