Roads Damage in Adilabad : అది జిల్లాలోనే అత్యంత కీలకమైన రోడ్డు. ఈ రహదారి గుండానే అనేక గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. దాని బాగోగులు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.30 కోట్లు మంజూరు చేసింది. అయినా ఆశించిన ఫలితం చేకూరలేదు. రోడ్డుపై అడుగడుగునా గుంతలు. చినుకుపడితే అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి. ఆదిలాబాద్ నుంచి నిరాల వరకు వెళ్లే లాండసాంగ్వి రహదారి దౌర్భాగ్యమిది.