Nizam College Students Protest For Hostel : హైదరాబాద్ నిజాం కళాశాలలో యూజీ విద్యార్థినుల ఆందోళన మరింత ఉధృతం అవుతోంది. ప్రిన్సిపాల్ తమ పోరాటాన్ని పట్టించుకోకుండా హాస్టల్లోని సగం సీట్లు పీజీ విద్యార్థులకు కేటాయిస్తూ సర్క్యులర్ జారీ చేయడంపై ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ధర్నా చేపట్టిన విద్యార్థులు అర్థరాత్రి అవుతున్నా కొనసాగిస్తున్నారు.