Surprise Me!

స్నాప్​చాట్​లో డీలింగ్స్ - కోడ్​ భాషలో స్మగ్లింగ్ - నైజీరియన్ డ్రగ్స్ గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు

2024-08-15 2 Dailymotion

Snapchat Drug Gang Busted in Hyderabad : బెంగళూరు కేంద్రంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ చేరవేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుల నుంచి రూ.1 కోటి 10లక్షల విలువ చేసే 256 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఫ్రాంక్ అనే ప్రధాన నిందితుడి ద్వారా ఇద్దరు అన్నదమ్ములు కోడ్ భాషలో హైదరాబాద్‌లోని కస్టమర్లకు డ్రగ్స్ చేరవేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.