TGSRTC on Cargo Services : సరకు రవాణాలోనూ ఆర్టీసీ తన వాటా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఖర్చులకు తగినట్లు అదనపు ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. వందలాది బస్ డిపోలతో విస్తృత నెట్వర్క్ కలిగిన ఆర్టీసీ ఇప్పటికే కార్గో సేవల ద్వారా మంచి ఆదాయాన్నే పొందుతోంది. ఆ రంగంలోని అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇంటి నుంచే పికప్ చేసుకుని హోం డెలివరీ ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో అమలు చేసి ఫలితాలు బాగుంటే అన్ని ప్రాంతాలను విస్తరించాలని యోచిస్తోంది.