Harish Rao On CM Revanth : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సీఎం వ్యవహారశైలి ప్రజలు గమనిస్తున్నారన్నారు. రుణమాఫీ పాక్షికంగా చేశారంటే సరే కానీ మొత్తం చేశామంటే మాత్రం అంగీకరించేది లేదన్నారు. రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.