Mynampally on Harish Rao in Siddipet : రుణమాఫీపై సవాల్ విసిరిన హరీశ్‌రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు డిమాండ్ చేశారు. ఇద్దరం కలిసి ఉపఎన్నికలో తలపడదామన్న మైనంపల్లి, ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని వెల్లడించారు. సిద్దిపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంలో రుణమాఫీపై గులాబీ పార్టీ నేతలు సమావేశమయ్యారు. మరోవైపు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.