Peddireddy Ramachandra Reddy Land Grabbing: ప్రభుత్వ భూమికి రక్షణగా నిలవాల్సిన రెవెన్యూ అధికారులు వైఎస్సార్సీపీ ముఖ్య నేత చేతిలో కీలుబొమ్మలుగా మారారు. జాయింట్ కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు ప్రతి ఒక్కరూ ఆయన అక్రమాల్లో పాలుపంచుకున్నారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పుప్పూ బెల్లంలా పంచిపెట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాపై ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాథమికంగా నివేదిక అందజేసింది. కుట్రలో భాగస్వాములైన వారందరిపైనా చర్యలకు సిఫార్సు చేసింది.