Surprise Me!

హైడ్రా హడల్ - మూడో కంటికి తెలియకుండా అక్రమ నిర్మాణాలపై ముప్పేట దాడి

2024-08-25 7 Dailymotion

HYDRA Action Plan On Encroachments Demolitions : హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాల పాలిట హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. భారీ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ అక్రమార్కుల గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. హైడ్రా ఏ రోజు ఎక్కడ కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో గుబులు పుడుతోంది. కొద్దిపాటి సిబ్బంది, అంతంతమాత్రంగానే ఉన్న యంత్రాలతో భాగ్యనగరంలోని అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ హడలెత్తిస్తోంది. మొన్న ప్రగతినగర్ ఎర్రకుంట, నిన్న మాదాపూర్‌లోని ఎన్​ కన్వెన్షన్‌లో భారీ నిర్మాణాలు నేలకూల్చేదాక పట్టువీడటం లేదు