Surprise Me!

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే పాస్ కావాల్సిందే

2024-08-27 12 Dailymotion

AUTOMATIC DRIVING TESTING TRACK: డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా పలుకుబడి ఉంటే చాలు. ఏ రాజకీయ నాయకుడో, మరో పెద్ద స్థాయి అధికారో చెబితే చాలు. లేదా మధ్యవర్తిని పట్టుకుని డబ్బులు చెల్లిస్తే చాలు వాహనం నడపకుండానే లైసెన్స్ వచ్చేసేది. ఇలాంటి వారి వల్లే రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకునేవి. ఇప్పుడు ఇదంతా గతం. తాజాగా రవాణా శాఖ అందుబాటులోకి తెచ్చిన కొత్త విధానం ద్వారా డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావాల్సిందే.