School Bus Overturned in Vizianagaram District : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వరదలు కొంత తగ్గడంతో పిల్లలు బడి బాట పట్టారు. ఆ క్రమంలో పంతొమ్మిది మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ వ్యాన్ అదుపు తప్పి పొలాల్లో పడిపోయింది.