Hydra Demolitions in Mallampet : హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారులకు వణుకు పుట్టిస్తున్నాయి. కబ్జా అని తెలిస్తే చాలు, ఎవరైనా, ఎవరి తాలుకానైనా నిర్మాణాలు కూల్చి చెరువులను రక్షించడమే హైడ్రా లక్ష్యం. తాజాగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని విల్లాలను హైడ్రా నేలమట్టం చేసింది. సుమారు 14 గంటల పాటు శ్రమించి కత్వా చెరువు ఎఫ్టీఎల్లో నిర్ధారించిన 28 అక్రమ విల్లాల్లో 14 విల్లాలను పూర్తిగా కూల్చివేసింది.