Harish Rao Slams Congress Govt : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ మసకబారిందని, రాజధాని బ్రాండ్ ఇమేజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి చంపేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ఈమేరకు నర్సాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రూ.800 కోట్ల ఉపాధిహామీ నిధులు సైతం దారి మళ్లించినట్లు ఆరోపించారు.