Minister Sridhar Babu Comments On BRS : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కానీ ప్రతిపక్షాలు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ హైదరాబాద్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు.