Demolition of Musi Encroachments : మూసీ సుందరీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి ఆదివారం నుంచే మూసీ ఆక్రమణలను హైడ్రాతో తొలగించనున్నారు. ఇళ్లు కోల్పోయిన పరివాహక ప్రాంతాల ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం మలక్‌పేట్‌లోని డబుల్ బెడ్రూం ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.