Surprise Me!

విశాఖలో బెట్టింగ్‌ యాప్‌ ముఠా గుట్టురట్టు

2024-10-17 0 Dailymotion

Betting APP Gang Arrest in Visakha : కాయ్ రాజా కాయ్ వంద పెట్టండి వెయ్యి గెలుచుకోండి. ఒకప్పుడు ఎక్కడో సందుగొందుల్లో గుట్టుగా సాగిపోయే ఈ బెట్టింగ్ వ్యవహారం. ఇప్పుడు పలు యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్ల ద్వారానే కాకుండా మొబైల్‌ యాప్‌ల రూపంలోనూ వచ్చేసింది. ఇందులో చిక్కుకొని అమాయకులు విలవిల్లాడుతున్నారు. ఆన్‌లైన్‌లో తారసపడుతున్న ప్రకటనలు క్షణాల వ్యవధిలో ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. పందేల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటుంటే నష్టపోయిన మరికొందరు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఈ తరహా మోసాలు కలవర పెడుతున్నాయి. వీటిపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నా పుట్టగొడుగుల్లా ఎక్కడోచోట పుట్టుకొస్తూనే ఉన్నాయి.