Surprise Me!

జగన్‌ గట్టి బదులిస్తూ రెండు పేజీల లేఖ రాసిన షర్మిల

2024-10-24 3 Dailymotion

Sharmila vs YS Jagan : వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా సోదరుడు జగన్‌ తమకు అన్యాయం చేశారని వైఎస్​ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర ఆస్తులు ఇచ్చి వెళ్లగొట్టాలని చూడటమే కాకుండా, పంపకాలపై చేసుకున్న ఒప్పందాన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. తల్లిపైనా, చెల్లిపైనా కేసు పెట్టి, కుటుంబాన్ని కోర్టుకీడ్చేంత నీచానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల విషయం సెటిల్‌ చేసుకోవాలంటే జగన్‌కు, అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని తనకు షరతు పెట్టడం ఏంటి అంటూ ఆమె జగన్‌కు గట్టి బదులిస్తూ రెండు పేజీల లేఖ రాశారు.