Surprise Me!

వైఎస్సార్సీపీ నేత గౌతమ్‌రెడ్డిపై రౌడీషీట్‌

2024-11-14 4 Dailymotion

Vijayawada CP Rajasekhar Babu on YSRCP Leader Goutham Reddy : తప్పుడు పత్రాలతో భూములు అక్రమించి నిర్మాణాలు చేపట్టడమేగాక న్యాయపోరాటం చేస్తున్న భూ యజమాని ఉమామహేశ్వరశాస్త్రిని అంతమొందించేందుకు వైఎస్సార్సీపీ నేత, ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్ గౌతంరెడ్డి (Goutham Reddy) కుట్రపన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఈ విషయంపై విజయవాడ సీపీ రాజశేఖర్‌ బాబు స్పందిస్తూ రూ.కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు గౌతమ్‌రెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు విచారణలో తేలిందని అన్నారు. గౌతమ్‌రెడ్డిపై హత్య సహా 43 కేసులు నమోదైనట్లు వివరించారు. అతడిపై గతంలో రౌడీషీట్‌ నమోదైందని అయితే, అది ఎందుకు మూసివేశారో పరిశీలిస్తామని అన్నారు. గౌతమ్‌రెడ్డిపై నమోదైన కేసులన్నింటిపైనా విచారణ చేస్తామని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.