Surprise Me!

ఘనంగా మంగళగిరి ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవం

2024-12-17 2 Dailymotion

AIIMS Mangalagiri First Convocation: యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అత్యాధునిక సేవలు అందిస్తున్న ఎయిమ్స్‌కు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు, సంస్థ దేశంలోనే నెంబర్‌ -1గా ఉండాలని ఆకాంక్షించారు. అందుకు ఎయిమ్స్‌ సిబ్బంది కృషి చేయాలన్న సీఎం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.