Allu aravind On Sritej Health :సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్ల పరిహారాన్ని అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాత దిల్ రాజుతో కలిసి పరామర్శించిన అనంతరం పరిహారాన్ని అల్లు అరవింద్ ప్రకటించారు. హీరో అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, పుష్ప-2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత చెక్కులను ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందజేశారు.