బుధవారం నాడు మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. తనతో పాటు, భార్య మోనికపైనా దాడి చేశారని అందులో పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. సొంత ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించట్లేదని మనోజ్ పోలీసులను ప్రశ్నించారు. ఈ క్రమంలో స్పందించిన పోలీసులు శాంతిభద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని ఆయనకు చెప్పారు.