Surprise Me!

YUVA : క్యాన్సర్ పేషెంట్స్​కు ఉచితంగా విగ్గులు - హైదరాబాదీ కుర్రాడి వినూత్న ఆలోచన

2025-01-20 4 Dailymotion

Cancer Patients Wigs : 5.4.3.2.1 ఈ సూత్రాన్నే ఫాలో అవుతున్నారు నేటితరం. ఐదంకెల జీతం. ఫోర్‌ వీలర్‌. త్రిపుల్‌ బెడ్‌రూం ఫ్లాట్‌. వీక్లీ 2 హాఫ్స్‌. నెలకు ఒక ట్రిప్‌. ఇలా సాఫీగా లైఫ్‌ లీడ్‌ చేస్తున్నారు. అయితే నలుగురు వెళ్లేదారిలో కాకుండా నలుగురికి అనందాన్ని పంచే దారి ఎంచుకున్నాడీ యువకుడు. స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి క్యాన్సర్ పేషంట్లకు ఉచితంగా విగ్గులు అందజేస్తున్నాడు.

హైదరాబాద్‌కి చెందిన శివ పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఓ పాఠశాలలో అటెండర్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. శివకి ఇద్దరు తోబుట్టువులు. ఇళ్లు గడవడమే కష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలో శివ హెయిర్ స్ట్రైలిస్​ కావాలని కలలు కన్నాడు. డిప్లమా చేసి జావీద్ హబీబ్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. జీవితాన్ని సాఫీగా మొదలుపెట్టాడు.

ఉచితంగా విగ్గులు పంపిణీ : హెయిర్‌ కట్ చేస్తున్న తరుణంలో వెంట్రుకలు నిరుపయోగంగా పడేయడం ఇతన్ని ఆలోచింపజేసింది. వాటిని ఉపయోగించలేమా అన్న సందేహం కలిగింది. అదే సమయంలో క్యాన్సర్‌ బాధితుల విగ్‌ కోసం జుట్టు ఇవ్వొచ్చని తెలుసుకున్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వెంట్రుకలను క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చేవాడు. అలా హెయిర్ డొనేషన్స్ వైపు శివ అడుగులేశాడు.

కరోనా సమయంలో క్యాన్సర్ బాధితులకు విగ్గులు డొనేట్‌ చేసే సంస్థ తమ కార్యకలాపాలను ఆపేసింది. ఈ క్రమంలోనే విగ్ కోసం ఓ చిన్నారి ఇతన్ని ఆశ్రయించడంతో మనమెందుకు నేరుగా విగ్గులు అందజేయోద్దని భావించాడు. 'హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషంట్స్' పేరుతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి క్యాన్సర్‌ పేషెంట్లకు ఉచితంగా విగ్గులు అందిచడం మొదలు పెట్టాడు.