Medical and Health Minister Satyakumar Inspection in Vijayawada GGH : విజయవాడ జీజీహెచ్ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓపీ కౌంటర్లు పరిశీలించారు. రోగుల్ని అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఔషదాలు అందుబాటులో ఉన్నాయా ? లేవా ? అని ఆరా తీశారు. స్ట్రెచర్లు, వీల్ ఛైర్లపై రోగులను తీసుకెళ్లే సిబ్బంది కొరత ఉందని త్వరలోనే నియామకాలు చేపడతామన్నారు. సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లిన ఆసుపత్రి సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. పేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపడుతున్నామంటున్న మంత్రి సత్యకుమార్‌తో ముఖాముఖి.